కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య స్మరభూమిసుతాధిపతిం సతతం
మేఘరంజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
స్మరభూమిసుతాధిపతిం సతతం
మరుదాత్మభవార్చిత మీశనుతం॥
అనుపల్లవి:
దరహాసయుతం కరుణాన్వితం
సరసీరుహలోచనశోభితం॥
చరణము(లు):
భాసమాన శరాసన బాణధరం
శాసితేంద్రతనూత మఘాళిహరం॥
భాసురాంగదమాశ్రిత కల్పతరుం
వాసుదేవ మినాన్వయరాజగురుం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - smarabhUmisutAdhipatiM satataM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )