కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భజనసేయరాదా - ఓమనస - శ్రీరాముని॥
ధర్మవతి - చతురశ్ర రూపక
పల్లవి:
భజనసేయరాదా - ఓమనస - శ్రీరాముని॥
అనుపల్లవి:
అజభవేంద్రాదినుతుని - సుజనావనలోలుని॥
చరణము(లు):
పరనారీ సహోదరుని - పరిపూర్ణకాముని
ధరణిజామనోహరుని - పరవాసుదేవుని॥
శరణజనాధారుని - సరసీరుహనేత్రుని
నిరవధి సుఖదాయకుని - పరమాత్ముని భక్తపాలుని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhajanasEyarAdA - Omanasa - shrIrAmuni\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )