కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఇదినీకు న్యాయమా శ్రీరామ
గమనశ్రమ - మిశ్ర చాపు
పల్లవి:
ఇదినీకు న్యాయమా శ్రీరామ
ఇదినన్నుబ్రోవ సమయముగాదా॥
అనుపల్లవి:
సదయుడు నీవని చాలనమ్మితె - నీ
హృదయము కరగదా - పరిపూర్ణకామ॥
చరణము(లు):
వారిజదళనేత్ర - వారిదనిభగాత్ర
వాతాత్మజనుత - వరమునివందిత॥
సురవైరి రావణాసురహర శ్రీకర
పరిహృతభవభయ పరవాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - idinIku nyAyamA shrIrAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )