కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఇది సమయము బ్రోవరాదా యదుకులతిలక॥
నాటకప్రియ - చతురశ్ర రూపక
పల్లవి:
ఇది సమయము బ్రోవరాదా యదుకులతిలక॥
అనుపల్లవి:
సదయహృదయ సర్వేశ మదనకోటిసుందర॥
చరణము(లు):
కరుణజేసి మును నీవే కరిరాజుని బ్రోవలేదా
మురహర మందరగిరిధర మురళీధర శ్రీకర
పరమ పురుష వాసుదేవ గరుడగమన గానలోల॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - idi samayamu brOvarAdA yadukulatilaka\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )