కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీకెందుకు దయరాదు రామ నీరజాక్ష
సింహేద్రమధ్యమ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీకెందుకు దయరాదు రామ నీరజాక్ష
నిన్నే నమ్మిన నాపై॥
అనుపల్లవి:
రాకేందు నిభానన రామచంద్ర
సాకేతపురాధీశ సర్వేశ॥
చరణము(లు):
శరణాగత రక్షకుడనుచు నీదు
బిరుదులెల్ల నీవుమరచితి వేమో॥
ధీరాగ్రగణ్య ధరణిజారమణ
వరమీయవయ్య పరవాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIkeMduku dayarAdu rAma nIrajAxa - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )