కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కరుణించి బ్రోవరాదా
బంగాళ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కరుణించి బ్రోవరాదా
ధరణీసుతావర శ్రీరఘువీర॥
అనుపల్లవి:
శరచాపధరాశ్రిత మందార
పరిపూర్ణకామ రవికులసోమ॥
చరణము(లు):
పరమాత్మ నీవుధరలోను బుట్టి
సురవైరి రావణుని నిగ్రహించి॥
సురభూసురాదుల కెల్ల చాలా
పరితోషమిచ్చితివిగదా వాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - karuNiMchi brOvarAdA - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )