కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నా చై విడవకురా - నామీద దయయుంచరా॥
నాటకురంజి - చతురశ్ర రూపక
పల్లవి:
నా చై విడవకురా - నామీద దయయుంచరా॥
అనుపల్లవి:
ఓ చరాచరాధారా
నీ చరణము నెరనమ్మితి॥
చరణము(లు):
దేవదేవ శ్రీవాసుదేవ
మహాదేవ వినుత
నావ్యథలను దీర్చుటకు
నీవుగాక వేరెవరు॥
భావుక ఫలదానచతుర
భువనమోహనాకార
దేవకీసుకుమార
బ్రోవవయ్య శ్రీకర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nA chai viDavakurA - nAmIda dayayuMcharA\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )