కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీకెంత నిర్దయ రామ నాపై
భవప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీకెంత నిర్దయ రామ నాపై
నీరజాసనాది వినుత॥
అనుపల్లవి:
శ్రీకాంతవాసుదేవ దేవదేవ
శ్రితభక్తపాలన ధురీణ॥
చరణము(లు):
నిన్ను నమ్మినవాడని తెలియలేదా
కన్నతండ్రినీవేయని నమ్మలేదా॥
పన్నగశయనాశ్రితపాపహరణ
విన్నపంబుజేతు నన్నుబ్రోవరాదా॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIkeMta nirdaya rAma nApai - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )