కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శంకరి నిన్నే ఇక చాలా నమ్మితిని॥
కామవర్ధిని - మిశ్ర చాపు
పల్లవి:
శంకరి నిన్నే ఇక చాలా నమ్మితిని॥
అనుపల్లవి:
పంకజాక్షి నీదు మహిమ పొగడుట నాతరమా
పంకజాననే ప్రణతజన శంకరి శ్రీత్రిపురసుందరి॥
చరణము(లు):
కామజనక వాసుదేవ సహోదరి
శ్యామలాంగి శివహృదయోల్లాసిని॥
కామితార్థదాయిని కాత్యాయని
గౌరి కాచియున్న నన్ను కావవే జనని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shaMkari ninnE ika chAlA nammitini\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )