కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య బ్రోవవమ్మ శ్రీచాముండేశ్వరి॥
గౌరీమనోహరి - త్ర్యశ్ర రూపక
పల్లవి:
బ్రోవవమ్మ శ్రీచాముండేశ్వరి॥
అనుపల్లవి:
దేవదేవ శ్రీవాసుదేవ సహోదరి
దేవి కౌమారి కరుణాకరి శంకరి॥
చరణము(లు):
మహిషాసురాది రిపుమదవిభంజిని
మదనారి మానసోల్లాసిని॥
మహితాంగి గుహజనని
తుహినాద్రి నందిని
విహితమా నీవు నన్ను బ్రోవకుండేది॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - brOvavamma shrIchAmuMDEshvari\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )