కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దయతో నన్ను పాలింపవయ్య
సురటి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దయతో నన్ను పాలింపవయ్య
దశరథకుమార నీవు॥
అనుపల్లవి:
వయసు నూరున్నది యని
వనజనాభ నిన్నే మరచితినయ్య॥
చరణము(లు):
వాసుదేవ నీవే గతి యనుచు నమ్మి
దాసవర్యులెల్ల ముక్తిపొందలేద॥
ఆశతోను ఒక నిమిషమైన నిన్ను
దాస భావముతో భజన సేయలేదు॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dayatO nannu pAliMpavayya - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )