కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య లంబోదర మవలంబే
కాంభోజి - చతురశ్ర రూపక
పల్లవి:
లంబోదర మవలంబే
అంబాసుతమహర్నిశం॥
అనుపల్లవి:
తుంబుర నారద వినుతం
లంబాలక మిభవదనం॥
చరణము(లు):
సురభూసుర సంవేవిత చరణ మఘవిదూరం
శరణాగతమందారం కరుణాసాగరం॥
హరిణాంకగర్వహరం ధీరం గుహసోదరం
వరపాశాంకుశధరం వాసుదేవ భక్తవరం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - laMbOdara mavalaMbE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )