కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య సంకర్షణ మాంపాలయ
ఆభోగి - చతురశ్ర రూపక
పల్లవి:
సంకర్షణ మాంపాలయ
పంకజనయన కృపాలయ॥
అనుపల్లవి:
పంకజభవ వినుత చరణ
లంకాధిపహరణ నిపుణ॥
చరణము(లు):
భాసురశర కార్ముకధర
శాసితఖర మఖ నిశిచర॥
కోసలనృప వరకుమార
వాసవాది పాలనపర॥
శ్రీసమేత పీతాంబర
దాసవర్య మంగళకర॥
భాసమాన మురళీధర
వాసుదేవ దామోదర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - saMkarShaNa mAMpAlaya - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )