కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భజామి సంతత మధోక్షజం శుభచరితం వాసుదేవం
అఠాణ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
భజామి సంతత మధోక్షజం శుభచరితం వాసుదేవం
గజేంద్రపూజిత పదాంబుజం గుణభరితం కేశవం॥
అనుపల్లవి:
అజాది నిర్జరవినుతం భృతనిజాశ్రితాఖిల యాదవం
వ్రజాంగనార్పితదృశం శశిముఖమజామిళ వరదం అమితసువిభవం॥
చరణము(లు):
మురళీనినాద పరిమోహిత మృగపశుగణం మునివరశరణం
కరశోభిత నిరుపమ మరకత మణికంకణం భవభయ హరణం॥
నరకాసురాది సురరిపు కరికేసరిణం రుక్మిణీ రమణం
వరభీమపార్థ పాంచాలీ హృదయతోషణం ధృతవిభూషణం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhajAmi saMtata madhOxajaM shubhacharitaM vAsudEvaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )