కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మనసా వచసా శిరసానిశం భజతదేవదేవం
బేగడ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
మనసా వచసా శిరసానిశం భజతదేవదేవం
సనకాదిమునిగణ శరణం నారసింహం వాసుదేవం॥
అనుపల్లవి:
వనజాసనాద్యభివందిత వరచరణం స్తంభ సముద్భవం
దినరాజకోటిసన్నిభం హతహిరణ్యకశిపుదానవం॥
చరణము(లు):
కరుణాన్వితం కల్యాణగుణభరితం
శరణాగత ప్రహ్లాద పోషణరతం॥
కరిరాజ పాంచాలీముఖనుత మిం
దిరాపతి మఘరహితం
సురరిపుభయానకాద్భుత చరితం
వరదివ్యవిభూషణ విలసితం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - manasA vachasA shirasAnishaM bhajatadEvadEvaM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )