కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పాహికృష్ణ వాసుదేవ
బేహాగ్‌ - చతురశ్ర రూపక
పల్లవి:
పాహికృష్ణ వాసుదేవ
దేహిసద్గతిం మాధవ॥
అనుపల్లవి:
ఈహితార్థద సువిభవ
ద్రోహికంసహర కేశవ॥
చరణము(లు):
కంధరాతల పరితోషిత
బంధురమణి భూషణశత
గంధవాహసుత పూజిత
సింధుశయన సుగుణభరిత॥
కుందకుసుమ సువిరాజిత
మందహాస సురవందిత
మందరాద్రి ధరమునినత
నందగోపసుత సుచరిత॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - pAhikR^iShNa vAsudEva - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )