కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కలినరులకు నీమహిమ దెలుసున
మాయామాళవగౌళ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కలినరులకు నీమహిమ దెలుసున
కమలనయన వాసుదేవ మహానుభావ॥
అనుపల్లవి:
జలధిశయన జగజ్జన్మాదికారణ
జలజసంభవ భవేంద్రాది వందితచరణ॥
చరణము(లు):
సులలితమగు నీచరణము సోకగ
శిలయే యహల్యయై వెలయలేద మును॥
బలిని ప్రహ్లాదుని ధ్రువుని పాంచాలిని
సలుపలేదేమయ్య హలధరసోదర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - kalinarulaku nImahima delusuna - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )