కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ప్రణమామ్యహం శ్రీప్రాణనాథం నిరంతరం
రంజని - మిశ్ర త్రిపుట
పల్లవి:
ప్రణమామ్యహం శ్రీప్రాణనాథం నిరంతరం
ప్రణతజనాభీష్టఫలప్రద శ్రీరామసేవాధురంధరం॥
అనుపల్లవి:
ప్రాణాపానవ్యానాద్యాఖ్య ముఖ్యప్రాణం
ప్రాణినాం ప్రాణభూతం
ప్రీణితాశేషపాత్రం భరద్వాజాది
వినుత భారతీకళత్రం॥
చరణము(లు):
అంజనాగర్భ సంభూత వీరాగ్రేసరం ని
రంజన శ్రీ వాసుదేవహృదయాగారం సు
మంజుల ముఖారవింద జానకీప్రియకరం రిపు
భంజన చతురం ఋగ్వేద సువిదిత మహిమాకరం॥
రంజనీరాగతోషితం
కుంజరాస్యాదివందితం
సంజీవనోజ్జీవిత సుమిత్రాసుతం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - praNamAmyahaM shrIprANanAthaM niraMtaraM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )