కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రారా రాజీవలోచన రామ నన్ను బ్రోచుటకు
మోహన - చతురశ్ర త్రిపుట
పల్లవి:
రారా రాజీవలోచన రామ నన్ను బ్రోచుటకు
ధీరాశ్రితజనమందార కరుణాపారావార॥
అనుపల్లవి:
ఏర నీ కరుణ గల్గని కారణమేమో గానర
మారారి వినుత శుభద సుచరిత
పరాత్పర ధరణిజా మనోహర॥
చరణము(లు):
నీవే నా విభుడని నిరతము నీ పాదములను నెరనమ్మితి
నీవాడని నన్ను కరుణించి ఈవేళ నాచై విడువకుర॥
దేవదేవ దశరథనృపనందన దశముఖాది సకలరిపుగణహరణ
నీవనాదరణ సేయకుర పవనజాప్త శ్రీవాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rArA rAjIvalOchana rAma nannu brOchuTaku - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )