కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీకేల దయరాదు రామచంద్ర
కథనకుతూహల - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీకేల దయరాదు రామచంద్ర
నిన్నే నమ్మలేద భక్తవత్సల॥
అనుపల్లవి:
రాకేందు నిభానన జానకీశ
సాకేత పురాధీశ సర్వేశ॥
చరణము(లు):
నిగమార్థసార నిత్య నిర్వికార
నగరాజధర అనంతావతార॥
యోగీశ్వర శ్రీధర వాసుదేవ
పగలురేయి నిన్నే పొగడుచుండగ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nIkEla dayarAdu rAmachaMdra - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )