కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దయలేదేమి రామ పూర్ణకామ
సింహేంద్రమధ్యమ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దయలేదేమి రామ పూర్ణకామ
దశరథనందన దశముఖమర్దన॥
అనుపల్లవి:
దయజేసి భక్తుల తాపముదీర్చిన
ధర్మాత్ముడనుచు బిరుదు నీకుండగ॥
చరణము(లు):
సరసిజ సంభవాది వినుతచరణ
నిరతము నిన్నే నమ్మితినయ్య॥
పరవాసుదేవ పరాత్పర శ్రీకర
నిరుపమ మహిమ నిన్నేమని పొగడుదు॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dayalEdEmi rAma pUrNakAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )