కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య సిగ్గులేదు నాకించుకైన జూడ
బలహంస - చతురశ్ర త్రిపుట
పల్లవి:
సిగ్గులేదు నాకించుకైన జూడ
ఎగ్గులంతజేసి ఇంతనిన్ను వేడ॥
అనుపల్లవి:
దగ్గర నీవుండ దయవేడక
యగ్గలికమున జేసిన పనులను విను॥
చరణము(లు):
అన్యాయార్జనాసక్త చిత్తుడు
అన్యాన్న భోక్తాతిలోలుడు॥
ధన్యాత్ముడనుగాను బ్రోవమనగ
కన్నతండ్రి వాసుదేవ కృపానిధి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - siggulEdu nAkiMchukaina jUDa - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )