కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శివేపాహి శ్రీచాముండేశ్వరి
సురటి - ఖండ త్రిపుట
పల్లవి:
శివేపాహి శ్రీచాముండేశ్వరి
శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి॥
అనుపల్లవి:
నివారిత నిజభక్త పాపనిచయే
నిఖిలాగమవేద్య మహిమాతిశయే॥
చరణము(లు):
పావనయదుకుల భాగ్యదేవతే
పరమపురుష వాసుదేవ సహజాతే॥
భావుక ఫలదాయిని సుమమణిమాలిని
దేవాది సకలలోక పరిపాలిని॥
కోవిదహృదయ వికాసిని కల్యాణి
కాత్యాయని మహిషాసుర మర్దిని
దేవి శ్రీమజ్జయచామరాజేంద్ర కామితదాయిని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shivEpAhi shrIchAmuMDEshvari - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )