కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రామ నీ దయరాద రవివంశాంబుధి సోమ॥
భైరవి - మిశ్ర చాపు
పల్లవి:
రామ నీ దయరాద రవివంశాంబుధి సోమ॥
అనుపల్లవి:
ఆ ముని సుదతిని మును నీవే బ్రోవలేద
ఆ ముని సవమును పాలించలేద॥
చరణము(లు):
రాకేందు నిభవదన సాకేత వరసదన
శ్రీకాంచన వసన శ్రీకర మృదుగదన॥
ఏకానేకమై వెలయు ఓంకార స్వరూప
లోకావనాతి చతుర శ్రీకాంత వాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rAma nI dayarAda ravivaMshAMbudhi sOma\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )