కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీసరస్వతీం భగవతీం భజత
అఠాణ - మిశ్ర ఝంప
పల్లవి:
శ్రీసరస్వతీం భగవతీం భజత
శ్రితజన సకలాభీష్టదాయినీం సదా॥
అనుపల్లవి:
శ్రీసరోజ సంభవ దయితాం మహితాం
వాసవాదినుత వాసుదేవభక్తాం॥
చరణము(లు):
సనకాదిముని వరేణ్య సంస్తుతాం
కనకాంబర రత్నహార విభూషితాం॥
అనుపమ కరుణారస పరిపూర్ణాం
సులలిత కవితాదితోషిత స్వాంతాం॥
వనరుహనయనాం వారణగమనాం
నిరుపమవీణా పుస్తకాక్షమాలా సహితాం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIsarasvatIM bhagavatIM bhajata - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )