కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నమోస్తుతే దేవి సరస్వతి
కల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నమోస్తుతే దేవి సరస్వతి
సుమాళి భూషితే సురవినుతే॥
అనుపల్లవి:
విమూఢమతిదాన విఖ్యాతే
రమేశ వాసుదేవ వినుతిరతే॥
చరణము(లు):
శరణాగత పరిపోషణ నిరతే
కరుణారస భరితే దరహాసితే॥
కరధృతవర వీణాదిశోభితే
సరసిజ సంభవదయితే మహితే॥
సరసిజవదనే సరోజనయనే
సురుచిర మరకతమణి రశనే॥
పరమవేద మంత్రాక్షరసదనే
నిరుపమ మంగళకర గదనే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - namOstutE dEvi sarasvati - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )