కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య భజమానస సరస్వతీం శుభచరితాం విధిదయితాం
శంకరాభరణం - చతురశ్ర త్రిపుట
పల్లవి:
భజమానస సరస్వతీం శుభచరితాం విధిదయితాం
నిజపాద పంకజ వినతాశ్రితజన పోషణ నిరతాం॥
అనుపల్లవి:
సుజనేష్టవేదసదనాం నిజపాణిధృత వరవీణాం
ద్విజరాజసన్నిభవదనాం గజరాజమంద గమనాం॥
చరణము(లు):
దేవదేవ శ్రీవాసుదేవ పరమానుగ్రహ భరితాం
భావనాతిదూర నిరుపమమహిమాతిశయ సమన్వితాం॥
భావరాగతాళాది సుమధుర సంగీత రసాస్వాదినీం
కైవల్యమార్గ బోధక సుప్రతిభా విశేషదాయినీం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bhajamAnasa sarasvatIM shubhacharitAM vidhidayitAM - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )