కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మరిమరివచ్చున మానవజన్మము
కాంభోజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
మరిమరివచ్చున మానవజన్మము
మరవకవే మనసా శ్రీరఘురాముని॥
అనుపల్లవి:
పరవాసుదేవుని పరమభక్తులకు
నిరవధి సౌఖ్యము దొరకలేదేమి॥
చరణము(లు):
రామునిమహిమ నేనేమని పొగడుదు
ఆ మహాదేవుని భామకేదెలుసును॥
ఈ మహిలో మును రామదాసాదులను
భూమిజా రమణుడే ప్రేమతో బ్రోవలేద॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - marimarivachchuna mAnavajanmamu - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )