కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరులనువేడి నే పామరుడైతిని
నాగస్వరావళి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరులనువేడి నే పామరుడైతిని
పరమపురుష వాసుదేవ దయానిధే॥
అనుపల్లవి:
సరసిజభవ భవాదివినుతచరణ
సరసిజలోచన సాగరశయన॥
చరణము(లు):
సరగున మును కరిరాజుని బ్రోవలేద
కరుణతో ధ్రువుని ప్రహ్లాదుని బ్రోవలేద॥
శరణరక్షక నీదు బిరుదుని మరవక
వరములొసగి నన్ను పాలింపవయ్య॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - parulanuvEDi nE pAmaruDaitini - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )