కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కనికరముతో నన్ను బ్రోవరాద
కల్యాణి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కనికరముతో నన్ను బ్రోవరాద
కరివదన శ్రీవాసుదేవ నీవు॥
అనుపల్లవి:
సనక సనందనాది మునిజన చరణ
దినపతి కులాభరణ జానకీరమణ॥
చరణము(లు):
మునివర కౌశికాధ్వర పరిపాల
అనుపమ కుశలవగాన విలోల॥
దానవారి పరిపాల కనకమయచేల
దనుజ సంహరణలీల ఆనందకర శీల॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - kanikaramutO nannu brOvarAda - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )