కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నిన్ను నమ్మితి శ్రీరామచంద్ర
నాటకురంజి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నిన్ను నమ్మితి శ్రీరామచంద్ర
సన్నుతాంగ నీవే గతిగద॥
అనుపల్లవి:
కన్నతండ్రి నాపై కరుణలేద రామ
నిన్ను సన్నుతింప నాతరమ॥
చరణము(లు):
నన్ను బ్రోవుమని ఎంతవేడిన నా
విన్నపంబు వినరాద నాతోవాద॥
పన్నగేంద్రశయన పతితపావన
నన్ను మరవకుర శ్రీవాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - ninnu nammiti shrIrAmachaMdra - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )