కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కురుమే కుశలం కుంజరగమనే
కమలామనోహరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
కురుమే కుశలం కుంజరగమనే
కుందరదనే కుంజరనుత హరిమానస సదనే॥
అనుపల్లవి:
కురంగనయనే కోకిలగదనే
కుంభసంభవాది సన్నుతచరణే
కరుణారసపూర్ణే కమనీయ వదనే
కనక నూపురయుత చరణే॥
చరణము(లు):
పరమేశ్వర సంస్తుత జగదీశ్వర
పరవాసుదేవాతిశయ హృత్సుఖకరి
పరమేష్ట్యాది సురానందకరి
పరమాద్భుత జగల్లీలా లహరి
పరతత్త్వ ప్రతిపాదిత పరమ
పురుషార్థసాధన సంపత్ప్రదానకరి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - kurumE kushalaM kuMjaragamanE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )