కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య వరలక్ష్మి నమోస్తుతే
గౌరీమనోహరి - చతురశ్ర రూపక
పల్లవి:
వరలక్ష్మి నమోస్తుతే
వరదే నరహరి సుఖదే॥
అనుపల్లవి:
అరవిందలోచనే - అఘబృందమోచనే
అరుణాంబుజవర సదనే - అమరేంద్ర నుతచరణే॥
చరణము(లు):
వాసుదేవ వినుతిరతే - వాసవాది వందితే
భూసురాది సేవితే - భాసురమణి భూషితే
దాసజన కల్పలతే - దరహాసితే సువృత్తే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - varalaxmi namOstutE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )