కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దేవి కమలాలయే తవపాదభక్తిం దేహి దేహి॥
గరుఢధ్వని - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దేవి కమలాలయే తవపాదభక్తిం దేహి దేహి॥
అనుపల్లవి:
దేవాసురాది సంపూజితే దివ్యాభరణభూషితే॥
చరణము(లు):
శ్రీవాసుదేవ హృదయ నివాసిని సేవక జనాభీష్టదాయిని
భావనాతీత మహిమాన్వితే భవ్యాకృతి సంశోభితే॥
స్వరసాహిత్యము:
సర్వైశ్వర్య ప్రదాయిని సర్వపాప నాశిని
సర్వలక్షణ శాలిని సర్వలోక వ్యాపిని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dEvi kamalAlayE tavapAdabhaktiM dEhi dEhi\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )