కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీరమాదేవీ మామవతు సదా ముదా॥
శంకరాభరణం - చతురశ్ర రూపక
పల్లవి:
శ్రీరమాదేవీ మామవతు సదా ముదా॥
అనుపల్లవి:
క్షీరసాగర కన్యకా ద్వారకేశనాయికా
సురుచిర మృగమదతిలకా పరిభృత బృందారకా
స్మరజనక కృపాపూర్ణ భక్త భాగ్యదాయికా॥
చరణము(లు):
పరమాద్భుతచరితా పరమానందభరితా
పారరహిత మహిమాన్వితా ఫాలనేత్రపూజితా॥
పరవాసుదేవదయితా పరాశరాది వందితా
వరగానతోషితా వరమంగళదేవతా॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIramAdEvI mAmavatu sadA mudA\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )