కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఎవరిని వేడను ఎవరిని పొగడను
బిలహరి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
ఎవరిని వేడను ఎవరిని పొగడను
భువనరక్షక రామ నినువినా నేను॥
అనుపల్లవి:
అవనిజా సౌమిత్రి భరత శతృఘ్న
పవనజ విభీషణాది వినుత సుచరిత॥
చరణము(లు):
సామజరాజుని ధ్రువుని ప్రహ్లాదుని
ప్రేమజేసి నీవే బ్రోవలేద మును॥
శ్యామసుందరగాత్ర సరసిజదళనేత్ర
కామితఫలద శ్రీ పరవాసుదేవ నే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - evarini vEDanu evarini pogaDanu - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )