కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య బాలం గోపాలమఖిలలోకపాలం సదాశ్రయామి॥
భైరవి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
బాలం గోపాలమఖిలలోకపాలం సదాశ్రయామి॥
అనుపల్లవి:
బాలేందుభూషణాదివినుతం సుగుణభరితం
నీలరుచిర కుంతలజాల శోభితం నిగమవేద్య మహిమాన్వితం॥
చరణము(లు):
భవాబ్ధితారక మిభేంద్ర వరదం సమ్మోదిత నిజభక్తబృందం
భరద్వాజాదిసేవిత చరణం భవ్య వనమాలికాభరణం
దేవదేవమనంతావతారం దేవకీకుమారం పరాత్పరం॥
జీవేశ్వరం రుక్మిణీరమణం పురాణపురుషం భూసురశరణం
శ్రీవాసుదేవం వరమందహాసవదనం జితమదనం
రవిశశినయనం పవనాత్మజ పరమానందదం మధుమథనం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - bAlaM gOpAlamakhilalOkapAlaM sadAshrayAmi\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )