కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య హరిని భజించే భాగ్యము దొరకునేమి?
శంకరాభరణం - ఖండ త్రిపుట
పల్లవి:
హరిని భజించే భాగ్యము దొరకునేమి?
దొరకును దొరకును పరమభక్తులకు నిజముగ॥
అనుపల్లవి:
ధరణిజా మానసాంభోరుహ విభాకరుని
దశరథరాజేంద్ర సుకుమారుని ధర్మాత్ముని॥
చరణము(లు):
కరుణాసముద్రుని కల్యాణమూర్తిని
పరిపూర్ణకాముని పరవాసుదేవుని॥
తరణివంశాంబుధి చంద్రుని పరాత్పరుని
స్థిరముగ నమ్మినవారికి మోక్షమిచ్చే విభుని॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - harini bhajiMchE bhAgyamu dorakunEmi? - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )