కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మామవమృడజాయే మాయే
వసంత - చతురశ్ర త్రిపుట
పల్లవి:
మామవమృడజాయే మాయే
మరకత మణివలయే గిరితనయే॥
అనుపల్లవి:
సోమకులజ జయచామ మహీపతి
కామిత ఫలదాయిని కాత్యాయని॥
చరణము(లు):
నారదాదిముని మానస సదనే
తారకాధిపతి సన్నిభవదనే॥
చారురత్నరశనే సురదనే
సారసలోచనే సామజగమనే॥
సూరిజనావన నిరతే లలితే
సారతరాగమ మహితే సుచరితే॥
భూరికృపాన్వితే సురగణవినుతే
మారజనక వాసుదేవ సహజాతే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - mAmavamR^iDajAyE mAyE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )