కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నిన్నే నమ్మితినయ్య శ్రీరామ॥
సింహేద్రమధ్యమ - మిశ్రచాపు
పల్లవి:
నిన్నే నమ్మితినయ్య శ్రీరామ॥
అనుపల్లవి:
పన్నగేంద్రశయన పన్నగారి వాహన
పన్నగాచల భవ్యసదన ప్రపన్నార్తిహరణ నిపుణ॥
చరణము(లు):
పరమకృపాసాగర పరతత్త్వాధార
వరములొసగి బ్రోవవయ్య వాసుదేవ॥
నీరజనేత్ర నీరజనిభగాత్ర
గిరిరాజసుతావర శంకరసన్నుతిపాత్ర సచ్చరిత్ర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - ninnE nammitinayya shrIrAma\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )