కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య నీ పాదములే నమ్మితినయ్య
సరసాంగి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
నీ పాదములే నమ్మితినయ్య
నీరజాక్షరామ నిత్యపూర్ణకామ॥
అనుపల్లవి:
అపరాధముల దీర్చి బ్రోచుటకు
వేరెవరయ్య దేవాదిదేవ॥
చరణము(లు):
నీ మనసు కరగదేమి శ్రీ
రుక్మిణీరమణ పరవాసుదేవ॥
సామజాది మహాభక్త బృందపాల
సామగానలోల సత్యధర్మపాల॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - nI pAdamulE nammitinayya - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )