కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దాశరథే పాహిమాం దయాపయోనిధే సుగుణనిధే॥
బిలహరి - త్ర్యశ్ర త్రిపుట
పల్లవి:
దాశరథే పాహిమాం దయాపయోనిధే సుగుణనిధే॥
అనుపల్లవి:
ఈశవినుత చరణారవింద ఇనకులాంబుధి చంద్ర
ఈశ చాపమదఖండనధురీణ సురమునిగణవినుత చరణ॥
చరణము(లు):
కుశలవగానలోల
కుశికాత్మజసవపాల
విశదీకృతజగల్లీల
దశరథవరబాల॥
ప్రశమితసురగణవైరిజాల
భృశమానతార్తిహరణశీల
శశినిభముఖ హిరణ్మయచేల
శ్రీశ వాసుదేవ దయాలవాల॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dAsharathE pAhimAM dayApayOnidhE suguNanidhE\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )