కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిరామ పరిపూర్ణకామ
రామప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిరామ పరిపూర్ణకామ
సురసౌఖ్యకామ సురవైరిభీమ॥
అనుపల్లవి:
సరసీరుహాక్ష వరదానదీక్ష
శరదిందువదన వరసింధుశయన॥
చరణము(లు):
కుశికాత్మజాధ్వరపాలక
దశరథతనూజ రఘునాయక॥
నిశిచరకులేశ దశవదనహర
సుశరీరవాసుదేవ శ్రీకర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhirAma paripUrNakAma - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )