కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య ఇంతపరాఙ్ముఖమేల శ్రీరఘువర
కల్యాణి - మిశ్ర ఝంప
పల్లవి:
ఇంతపరాఙ్ముఖమేల శ్రీరఘువర
ఇకనైన నామనవి వినరాద॥
అనుపల్లవి:
దాంతవినుత శ్రీజానకీకాంత నాదు
చింతదీర్చి వరములిచ్చి పరిపాలించుటకు॥
చరణము(లు):
నీవు భక్తవత్సలుడని నేనెంచి
నీవేగతియని నిన్ను నమ్మలేద॥
భావనాతీత నిరుపమామితవిభవ
దేవదేవ భవనుత శ్రీవాసుదేవ నీకు॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - iMtaparA~NmukhamEla shrIraghuvara - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )