కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య బ్రోవరాద శ్రీవెంకటేశ నన్ను
వరుణప్రియ - చతురశ్ర త్రిపుట
పల్లవి:
బ్రోవరాద శ్రీవెంకటేశ నన్ను
శ్రీవాసుదేవ శ్రితపారిజాత॥
అనుపల్లవి:
నీవ జీవులకు నిత్యరక్షకుడై
కావవేమి శ్రీకర దేవదేవ॥
చరణము(లు):
భక్తిరక్తి విరక్తుల నేనెరుగ
భక్తపాల నా చింతలెల్లదీర్చి॥
ముక్తయోగి వరాసక్తచిత్త వర
ముక్తిమార్గమును జూపివేగముగ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - brOvarAda shrIveMkaTEsha nannu - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )