కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య కలయే మమహృదయేత్వాం కమలాలయే
హిందుస్తానికాపి - ఖండత్రిపుట
పల్లవి:
కలయే మమహృదయేత్వాం కమలాలయే
కలికలుషవిదూరవాసుదేవజాయే॥
అనుపల్లవి:
కలాపసుశోభిత సుందరకాయే కృపాలయే
కలాధరబింబసన్నిభసుఖప్రదచ్ఛాయే
కల్యాణ గుణనికాయే కలధౌతఖచితమణివలయే
కలభాషణప్రియే॥
చరణము(లు):
వారిజోద్భవాదిధ్యేయే వారిధితనయే
వారిజదళవిశాలనేత్రద్వయే వరేణ్యే॥
వారితభక్తసంతాపనిచయే విశ్వప్రియే
వారిజాభివ్యక్త మహోదయే సుహృదయే॥
వరముని నారదాదిహృన్నిలయే
వరవర్ణిని కుంకుమాద్యర్చనప్రియే
వరమందహాస శోభితాస్యే
వరుణాద్యష్ట దిక్పాలకాభివంద్యే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - kalayE mamahR^idayEtvAM kamalAlayE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )