కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య శ్రీరామచంద్రం భజరే మానస॥
ఝూలవరాళి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
శ్రీరామచంద్రం భజరే మానస॥
అనుపల్లవి:
వీరాధివీరం సుచరిత్రం
ధీరరావణహరం దశరథరాజ కుమారం॥
చరణము(లు):
పరమపురుష వాసుదేవం పరిపూర్ణకామం
శరణాగతార్తిహరణ ధురీణం సరసీరుహదళలోచనం
పరిపాలితాఖిల భువనం పవనతనయ వందితచరణం॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - shrIrAmachaMdraM bhajarE mAnasa\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )