కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య గిరిజారమణ నతజనశరణ
గంభీరనాట - చతురశ్ర త్రిపుట
పల్లవి:
గిరిజారమణ నతజనశరణ
కరుణారసపూర్ణ స్మరహర నాగాభరణ॥
అనుపల్లవి:
పరవాసుదేవారాధనధురీణ
కరధృతహరిణ కలిమలహరణ॥
చరణము(లు):
మహాపంచాక్షరీ మంత్రమూర్తే
మహాభక్తకౌంతేయనుతకీర్తే॥
మహాగణపతి గుహసేవితమూర్తే
మహాదేవ పరిహృతదీనజనార్తే॥
మహానంది భృంగ్యాది గంభీర
నాట్య ప్రదర్శక కైలాసపతే॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - girijAramaNa natajanasharaNa - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )