కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య దేవాదిదేవ శ్రీవాసుదేవ
సునాదవినోదిని - చతురశ్ర త్రిపుట
పల్లవి:
దేవాదిదేవ శ్రీవాసుదేవ
కావుమయ్య నన్ను కరుణాలవాల॥
అనుపల్లవి:
ఈవేళ నాయారు శత్రులను
నీవే పారద్రోలి నిజభక్తుజేసి॥
చరణము(లు):
నే జేసిన పూజాఫలమో
నాపూర్వజుల పుణ్యఫలమో॥
శ్రీజానకీశ ఈజన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భువిజేసితివి॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - dEvAdidEva shrIvAsudEva - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )