కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిమాం శ్రీదాశరథే
శుభపంతువరాళి - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిమాం శ్రీదాశరథే
పరవాసుదేవ మహానుభావ॥
అనుపల్లవి:
ధరణీసుతామానసవిహార
ధర్మార్థకామమోక్షాధార॥
చరణము(లు):
సాకేతపురాధీశ సర్వేశ
సత్యధర్మపాలక స్వప్రకాశ
రాకాసుధాకరనిభానన
రాజీవనయన రక్షితభువన॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhimAM shrIdAsharathE - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )